Blog

Latest News
కళామతల్లి ముద్దుబిడ్డ నాయి బ్రాహ్మణుల కలల వెలుగు తూముల శ్రీనివాస్

కళామతల్లి ముద్దుబిడ్డ నాయి బ్రాహ్మణుల కలల వెలుగు తూముల శ్రీనివాస్

తూముల శ్రీనివాస్
అభ్యుదయ కవి. రచయిత. గాయకుడు.
నటుడు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల పరిధిలో గల
టు ఇంక్లైన్ గ్రామపంచాయతీ పటేల్ బస్తీ నందు నివాసం ఉంటున్న తూముల శ్రీనివాస్ 19 62 జులై 22వ తేదీన తూముల లింగయ్య మల్లమ్మ దంపతుల గర్భాన తృతీయ పుత్రుడిగా జన్మించి చిన్ననాటి నుండే అభ్యుదయ భావాలతో తన తండ్రి తూముల లింగయ్య జానపద కళారూపాలైన చిరుతల రామాయణం భాగవతం లాంటి ఇతిహాసాలలో అనేక పాత్రలు పోషించిన తండ్రి లింగయ్య గారి వారసత్వాన్ని పునికి పుచ్చుకొని కళాకారుడిగా విద్యార్థి దశలోనే అనేక నాటిక నాటకాలలో నటుడిగా గాయకుడిగా ఎదుగుతూ సిపిఐ పార్టీ ప్రజానాట్యమండలి కళాకారుడిగా క్రియాశీల నాయకుడిగా ఎదుగుతూ జిల్లా రాష్ట్ర స్థాయి నాయకుడిగా సేవలు అందిస్తూ ఉద్యమ గీతాలను జానపద ప్రజా చైతన్య గీతాలను ఆలపించడమే కాక వందలాది కవితలను గేయాలను రాస్తూ గ్రామస్థాయి నుండి జాతీయ అంతర్జాతీయ అనేక బహుమతులు తన సొంతం చేసుకున్న తూముల శ్రీనివాస్ నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ లో చురుకైన పాత్ర పోషిస్తూ మండల స్థాయి నుండి రాష్ట్రస్థాయి ఉపాధ్యక్షుడిగా నాయి బ్రాహ్మణ సేవా సంఘానికి సేవలు అందిస్తూ ఆలిండియా రేడియో ఎఫ్ఎం నందు నాటికలు వ్రాసి తన తోటి కళాకారులతో ప్రోగ్రాములు చేస్తూ చైతన్య దేశభక్తి గీతాలను ఆల్ ఇండియా రేడియోలో ఆలపిస్తూ హైదరాబాదు దూరదర్శన్ వారు నిర్మించిన నవోదయం తెలి ఫిలిం నందు కూడా నటిస్తూ విమర్శకుల ప్రశంసలు పొందుతూ

            //కవి మిత్ర// ఉద్యమ కవి// ఇలాంటి బిరుదులను సొంతం చేసుకున్న తూముల శ్రీనివాస్ తన సహధర్మచారని రత్నకుమారి. తనకు తన కలలకు చేదోడుగా ఉంటూ అలాగే తన పుత్రుడిగా జన్మించిన తరుణ్ కుమార్ మణికంఠ బీకాం కంప్యూటర్స్ విద్యలో ప్రావీన్యుడై సాఫ్ట్వేర్ కంపెనీలో చిరు ఉద్యోగిగా చేరి తనను నమ్మిన కంపెనీకి సేవలను అందిస్తూ తన కర్తవ్యం కార్య దీక్షలో కొడుకును సఫలీకృతుడిని చేసిన తూముల శ్రీనివాస్ ఇటు కళా రంగంలో అటు రాజకీయ సామాజిక రంగాలలో
అనేకమంది నిరుపేద నిర్భాగ్యులకు అండగా నిలిచి వారి సమస్యల పట్ల పోరాటం సాగిస్తూ ఎక్కడ సమస్య ఉంటే అక్కడ తాను ఉండి ఆ సమస్యలకు పరిష్కార మార్గం చూపించే తూముల శ్రీనివాస్ తన జీవిత చరమాంకం వరకు కూడా సమాజ. రాజకీయ. కళా రంగ సేవకుడిగా తన శేష జీవితాన్ని కొనసాగించడానికి నిర్ణయించుకోవడం జరిగినది
=============

 

 

 

Share This Post

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *