Blog

Latest News
తెలంగాణలో ఉన్న నాయీబ్రాహ్మణుల సంక్షేమం కోసం

తెలంగాణలో ఉన్న నాయీబ్రాహ్మణుల సంక్షేమం కోసం

తెలంగాణలో ఉన్న నాయీబ్రాహ్మణుల సంక్షేమం కోసం, నాయీబ్రాహ్మణుల అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో నిరంతరం కృషి చేస్తున్న సంఘాలు అన్ని ఏకతాటిపైకి వచ్చి ఈ రాష్ట్రంలో ఒకేసంఘంగా ఏర్పడాలన్న అజెండాతో ఈ నెల 16-09-23 శనివారం రోజున మధ్యాహ్నం 2.గంటలకు కోటిలోని బిసి సాధికారత భవన్ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయీబ్రాహ్మణ సంఘాలకు, యువజన సంఘాలకు, విద్యార్థి సంఘాలకు, మహిళ సంఘాలకు, వాయిద్య కాళకారుల సంఘాలకు ఉద్యోగ సంఘాలకు ఇదే మా ఆహ్వానం‌.

ఇందులో చర్చించే ముఖ్యమైన అజెండా.
1) ఈ రాష్ట్రంలో నాయీబ్రాహ్మణ కులానికి ఒకే సంఘం ఉండాలనేది ప్రధాన అజెండా

2) ఈ రాష్ట్రంలో 33 జిల్లాలో ఉన్న ప్రతి నాయీబ్రాహ్మణ సోదరుడిని కదిలించి హైదరాబాద్ నగరంలో ఒక గొప్ప బహిరంగ సభ ఎర్పాటు చేసి నాయీబ్రాహ్మణులకు ఉన్న శక్తిని ఈ ప్రభుత్వానికి తెలియజేయాలి అనేది రెండవ అజెండా

కావున ఈ సమావేశానికి అయ సంఘాల ప్రతినిధులు హాజరై మియోక్క అమూల్యమైన సూచనలు సలహాలు ఇవ్వవలసినదిగా మనవి..

-మీ..గుంజపడుగు హరిప్రసాద్ నాయీ

Share This Post

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *