Blog

Latest News
నాయీబ్రాహ్మణులు రాజకీయకంగా మరియు సామాజికంగా అభివృద్ది చెందాలనేదే అతని ఆకాంక్ష:సింగిరాల వెంకట స్వామి గారు

నాయీబ్రాహ్మణులు రాజకీయకంగా మరియు సామాజికంగా అభివృద్ది చెందాలనేదే అతని ఆకాంక్ష:సింగిరాల వెంకట స్వామి గారు

శ్రీ సింగిరాల వెంకట స్వామి గారు కరీంనగర్ జిల్లా  లో జన్మించారు. విధ్యాభ్యాసం కరీంనగర్ పట్టణం లో పూర్తిచేశారు . కులవృత్తి  అయిన క్షౌర వృత్తి చేసుకుంటూనే  సంఘం లో ఎన్నో సేవలు అందిస్తున్నారు ,తెలంగాణ రాష్ట్ర కేంద్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సమైక్య సంక్షేమ సేవ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా భాధ్యతలను నిర్వహిస్తున్నారు. నాయీ బ్రాహ్మణుల బాదలను తెలుసుకొని వాళ్ళకు అండగా నెనున్నానంటూ వాళ్ళకు ధైర్యాన్ని నింపిన మన శ్రీ సింగిరాల వెంకట స్వామి గారు క్షౌర శాలలకు ఉచిత విధ్యుత్ కోసం ఎంతో కృషి చేశారు . సామజిక రాజకీయ కార్యక్రమాల్లో ఎంతో చురుగ్గా పాల్గొంటూ సంఘ సభ్యులా మన్నలను పొందారు సింగిరాల వెంకట స్వామి గారు. ­సంఘ సేవ కార్యక్రమాలో చురుగ్గా పాల్గొనడమే అతని ప్రత్యేకత. అదేవిధంగా వివిధ రంగాలలో నిష్ణాతులైన వ్యక్తులకు అవార్డ్సు అందించడంతోపాటు పురస్కారాలు అందించడం ద్వారా సంఘ సేవకులను, విద్యా, సంగీతం, సాహిత్యం, రాజకీయం, జర్నలిజం వంటి రంగాలలోని వారిని ప్రోత్సహిస్తున్నారు 2009 నుండి 2014 వరకు నాయీబ్రాహ్మణ కమిటీ మెంబర్ గా, రాష్ర్ట ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. అంతకుముందు పొన్నం ప్రభాకర్ గారు కాంగ్రెస్ నాయకుడుగా ఉన్నప్పుడు ఆయన నిర్వహించిన అన్ని కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు ,అనాటినుంచే రాజకీయాల్లో ఆసక్తి పెంచుకున్నారు, అనేక సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, వెంకట స్వామి గారు సంఘం కొరకు చేసిన కృషి ద్వారా అనేక సత్కారాలు ,పురస్కారాలు పొందారు . నాయీ బ్రాహ్మణుల తరపున అనేక పోరాటాల్లో పాల్గొన్నారు.తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్నారు.

ప్రస్తుతం కరీంనగర్ లో  స్థిరపడ్డారు .ఎంతో సంస్కారంతో సంఘీయులతో కలసి మెలసి తిరగడం,సంఘ కార్యక్రమాల్లో  తాను స్వయంగా పాల్గొనడమే కాకుండా అనేక ఉద్యోగులైన సంఘీయులను సంఘంలో క్రియాశీలకంగా వ్యవహారించేలా ప్రోత్సహించారు. నాయీ బ్రాహ్మణ సమాజం బాగు పడాలంటే రాజకీయంగా ఎదగడం ఒక్కటే మార్గమని గట్టిగా నమ్ముతారు. సంఘీయుల అభ్యున్నతికి ఎంతో కృషిచేశారు. ఎన్నో  సంవత్సరాలుగా చేస్తున్న సంఘసేవ ప్రధానంగా మన నాయీ బ్రాహ్మణుల స్థితిగతులపై వచ్చిన అనుభవంతో నేటికీ సేవలందిస్తున్నారు. సంక్షేమ సంఘం నాయకులతో కలసి

రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ సంఘీయుల సమస్యల పరిష్కారంలో చురుకుగా పాల్గొంటున్నారు. కేవలం నోటి మాటలకే పరిమితం కాకుండా సేవ కార్యక్రమాలను ఆచరణలో చూపిన దిట్ట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నతాధికారులతో తనకున్న అపారమైన పరిచయాలను

సంఘీయుల ఉన్నతికి ఉపయోగించే వారు. ఎక్కడ పని చేసినా ప్రజలు, పైస్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులకు ఒదిగి పోతూ అందరు బాగుండాలి అందులో నేనుండాలనే సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తి. పుష్కర కాలంలోనే ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపా దించుకున్న ధీశాలి.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలం

గాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సమైక్య సంక్షేమ సేవ సంఘం నూతనంగా ఏర్పాటైంది . ఈ నాయిబ్రాహ్మణ సంఘం కార్యకలాపాలు ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా నాయీ బ్రాహ్మణ సంఘాలన్నీ ఒకే వేదికపైకి తీసకువచ్చి సేవ సంఘాన్ని ఏర్పాటు చేశారు .జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గార్కి అనుచరుడైన  సింగిరాల వెంకట స్వామి చొరువతోనే ఈ  సంఘం ఏర్పాటైంది .కాంగ్రెస్ ప్రభుత్వంలో  మన నాయీ బ్రహ్మణుల సమస్యలను పరిష్కారం అయ్యేలా కృషిచేస్తున్నారు .రాజకీయం పై ఎంతో మక్కువ తో  మంత్రి పొన్నం ప్రభాకర్ గార్కి అనుచరుడైన  సింగిరాల వెంకట స్వామిగారు ఎన్నో రాజకీయ సభల్లో పాల్గొని మన సంఘం పేరు ప్రఖ్యాతలను పెంచారు . నాయీ బ్రాహ్మణ సంఘంలో ప్రతి ఒక్క సంగీయులకి తెలిసిన వ్యక్తి మన సింగిరాల వెంకట స్వామి గారు . ఎలాంటి సమయంలో అయిన సంఘంలో జరుగుతున్న కార్యక్రమాల్లో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసేవారు .

Share This Post

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *