Blog

Latest News
నాయీబ్రాహ్మణులు రాజకీయకంగా మరియు సామాజికంగా అభివృద్ది చెందాలనేదే అతని ఆకాంక్ష

నాయీబ్రాహ్మణులు రాజకీయకంగా మరియు సామాజికంగా అభివృద్ది చెందాలనేదే అతని ఆకాంక్ష

శ్రీ అన్నం మోహన్ గారు ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు లో జన్మించారు . అన్నం మోహన్ గారు M .A . ఆగ్లం మరియు B.E.D విధ్యని మొత్తం కాకతీయ ,మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాల్లో అభ్యసించారు . ఉన్నత విశ్వ వి  ద్యాలయాల్లో అభ్యసించినమేరకు అన్నం మోహన్ గారికి సంఘం పట్ల ప్రేమాభిమానలతో కళాశాలలో అధ్యాపకునిగా చేస్తున్నప్పటికి సంఘసేవకై ముందుండేవాడు . నాయీ బ్రహ్మాణ సంఘం జిల్లా అధ్యక్షుడుగా కూడా భాద్యతలు నిర్వహించారు.

సంఘ సేవ చేస్తూనే అతను ఆర్ధికంగా వెనుకబడిన విధ్యార్ధులకు , తల్లి తండ్రులు లేని విధ్యార్ధులకు ఎన్నో సహాయాలు చేసి స్వయంగా వాళ్ళకు విధ్యని బోధించడం ప్రేత్యేకత. శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ , సర్వర్ చారిటబుల్ సేవా ట్రస్ట్ మరియు నాయి బ్రాహ్మణ సేవా సంఘం పేరిట తానే స్వయంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు ,అన్నం మోహన్ గారు చదువుల తల్లి ముద్దుబిడ్డగా మన నాయీ బ్రహ్మణ కుటుంభంలో జన్మించడం మనకు గర్వకారణం . అలాగే తనకంటూ సొంతంగా బ్యూటీ పార్లర్ ని పెట్టుకొని క్షౌర వృత్తి చేస్తూ అటు వృత్తికి ప్రాముఖ్యత ఇస్తున్నారు.అలాగే మన అన్నం మోహన్ గారు రాష్ట్ర కళ్యాణకట్టల సంఘానికి ప్రెసిడెంట్ గా భాధ్యతలను నిర్వర్తిస్తున్నారు . అలాగే నాయీ బ్రాహ్మణ ప్రజా శక్తి రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా సేవలను అందిస్తున్నారు . 2020 నుండి 2023 వరకు బి ఎస్ పి వైస్ ప్రెసిడెంట్ గా సేవలను అందించారు .మన నాయీ బ్రాహ్మణ సంఘంలో యువ జన సంఘ నాయకుడిగా ఎన్నో సేవలందిస్తున్నారు . అతనొక ఉపన్యాసకుడు . గొప్ప ఆధర్శవంతుడు . ఎంతో మంది విధ్యార్ధులకు ఆర్ధికంగా మరియు విధ్యా పరంగా అండగా ఉంటున్నారు. కమ్యూనిటీలో వివిధ కారణాలవల్ల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి వివిధ సేవా సంస్థల ద్వారా కొంత ఆర్థిక సహాయం చేయించడం స్వయంగా కొంత ఆర్ధిక సహాయం చేయడం అతని ప్రత్యేకత . అతను చదివిన విధ్యకు గాను ఎన్నో కళాశాలల్లో అధ్యాపకునిగా ఎన్నో ఉద్యోగాలను అలవోకగా చేయగల ధిశాలి కానీ మన నాయీ బ్రాహ్మణ సంఘానికి సేవలను చేయాలన్నదే అతని ఆకాంక్ష. నాయీ బ్రాహ్మణ అభ్యున్నతిని ఆకాంక్షించి అనుక్షణం పేద వారికి అండగా ఉండేందుకు తాపత్రయపడుతుంటారు మన అన్నం మోహన్ గారు. మారుమూల గ్రామంలో ఉంటూ అనేక సంఘ కార్యక్రమాలల్లో పాల్గొని మన నాయీ బ్రాహ్మణ ఐక్యతకు తోడ్పడుతున్నారు .అనేక సేవ కార్యక్రమాలను నిర్వహించి సంఘ బాగు కోసం ఎంతో కృషి చేశాడు ,ములుగు అంతగా అభివృద్ది చెందిన జిల్లా కాదు ఐనప్పటకీ ఉన్నత విద్యలను అభ్యసించి ఎంతో మంది ఆచార్యుల చేత ప్రసంశలు పొందారు.సంఘంలో కళ్యాణకట్ట కమ్యూనిటి రాష్ట్ర ప్రెసిడెంట్ అవ్వడం విశేషం . నాయకునిగా సంఘంలో ఇబ్బందులను తెలుసుకొని పేద నాయీబ్రహ్మణుల వెంట ఉంటూ వల్ల స్తితి గతులను తెలుసుకుంటూ నాయీ బ్రాహ్మణ ముద్దు బిడ్డగా ప్రతి ఒక్కల మనసుల్ని గెలుచుకున్న మన అన్నం మోహన్గారు ఎన్నో సత్కారాలను,పురస్కరాలను అందుకున్నారు . కుటుంబ భాద్యతలు నిర్వహిస్తూనే సంఘ కార్యక్రమాలలో పాల్గొన్నారు తాను స్వయంగా పాల్గొనడమే కాకుండా అనేక ఉద్యోగులైన సంగీయులను సంఘంలో క్రియాశీలకంగా వ్యవహరించేలా ప్రోత్సహించారు.

అలాగే దేవాలయాలల్లో క్షౌర వృత్తి వాయిద్య కళాకారుల పోస్టులను భర్తీ చేయాలని .రాష్ట్రంలో వేములవాడ, కొండగట్టు ,యాదగిరి గుట్ట, లక్ష్మీ నరసింహ స్వామి, గద్వాల దేవస్తానం ,చెరువు గట్టు ,కోడవతంచ లక్ష్మీనరసింహస్వామి ,బాసర సరస్వతి ,ధర్మపురి దేవస్తానం ,కొత్త గట్టు దేవస్తానం ,మహబూబ్ నగర్ జిల్లాలోని దేవస్తానల్లో, కాళేశ్వర దేవస్తానం ,సమ్మక్క సారక్క దేవస్తానాలలోని ఆలయాల ధర్మకర్తల మండలిలో సభ్యులిగా నాయీ బ్రహ్మణలకు అవకాశం కల్పించాలని . తలనీలాల టెండర్లలో మా నాయీబ్రాహ్మణులకు 50% రిసర్వేషన్ కల్పించాలని . తలనీలాలపై వచ్చే ఆదాయంలో కూడా మా నాయీబ్రాహ్మణులకు వాటా ఇవ్వాలని. నాయీ బ్రాహ్మణుల ఫేడరేషన్లకు పాలక మండలిని నియమించాలని .అదే విదంగా మన నాయీ బ్రాహ్మణులకు సంగీత కళాశాల ,బ్యుటీషియన్ ,శిక్షణ తరగతులకు చర్యలు చేపట్టేలా ప్రేత్యేక చోరువ మరియు నాయీ బ్రాహ్మణ అభివృద్ది కోసం ప్రతి బడ్జెట్ లో కొంత మొత్తాన్ని కేటాయించాలి అని ఆకాంక్షిస్తున్నారు.

Share This Post

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *