Blog

Latest News
నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం బీహార్ మాజీ ముఖ్యమంత్రి, కీ.శే. కర్పూరీ టాకూర్

నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం బీహార్ మాజీ ముఖ్యమంత్రి, కీ.శే. కర్పూరీ టాకూర్

 

భారతజాతి గర్వించతగిన నాయకుడు, నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం బీహార్ మాజీ ముఖ్యమంత్రి, కీ.శే. కర్పూరీ టాకూర్. బీహార్లోని పితంజియా(ఈ పేరును ప్రస్తుతం కర్పూరీ గ్రామంగా మార్పుచేశారు) అనే చిన్న గ్రామంలో క్షౌరవృత్తితో జీవించే గోకుల్ టాకూర్ అనే నాయీకి జన్మించారు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో డిగ్రీ చదువును అర్ధంతరంగా నిలిపివేసి స్వాతంత్రోద్యమంలో పాల్గొనడంతోపాటు 26 నెలలపాటు జైలు శిక్షను అనుభవించారు. స్వాతంత్ర్యం అనంతరం తమ గ్రామంలోనే కొంతకాలం పాటు ఉపాధ్యాయునిగా పనిచేస్తూ 1952వ సంవత్సరంలో బీహార్ విధానసభ సభ్యునిగా ఎన్నిక య్యారు. 1960లో జాతీయ స్థాయిలో జరిగిన పోస్టల్ అండ్ టెలిఫోన్(పి అండ్ టి) ఉద్యో గుల సమ్మెకు నాయకత్వం వహిం చారు. టెల్కో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆయన 1970లో 28 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. 1970లో తొలిగా కాంగ్రేసేతరపార్టీ ముఖ్యమంత్రిగా సోషలిస్టుపార్టీ తరపున అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించారు. సొంత సైన్యాలతో భూస్వా ములుకు, ముఠాలకు కేంద్రంగా వున్న బీహార్లో ఒక సామాన్య మంగలి కుటుంబం నుంచి నిజాయితీ, ఆత్మస్థయిర్యం, దైర్యం, విద్యను ఆయుధంగా చేసుకొని తిరుగులేని నాయకునిగా ఉన్నతస్థాయికి చేరుకొన్నారు. ఫాసిస్టులను మించి దారుణంగా వ్యవహారించే బీహార్ భూస్వాములను, వారి ఆగడాలను దైర్యంగా ఎదుర్కొన్నారు. బడుగులపాలిటి ఆశాజ్యోతిగా నిలిచారు. బడుగుల సంక్షేమం కోసమే తన జీవితాన్ని అంకితం చేశారు.
ముఖ్యమంత్రి కావడానికి ముందు రాష్ట్ర మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత బీహార్లో సంపూర్ణ మద్యనిషేధాన్ని అమలు చేశారు. విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వెనుకబడిన ప్రాంతాలలో పెద్దఎత్తున పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేశారు. స్వతహాగా హిందీ అభిమాని అయిన టాకూర్ బీహార్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా హిందీ భాషాభివృద్ధికి విశేష కృషి చేశార

లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్కు అత్యంత సన్నిహితుడైన కర్పూరీ టాకూర్ ఎమర్జన్సీ సమయంలో ఇతర జనతాపార్టీ నాయకులతో కలసి “సంపూర్ణ విప్లవం” పేరుతో అహింసాయుత దేశంగా తీర్చిదిద్దే ఉద్యమంలో కీలకపాత్ర వహించారు. 1977లో కాంగ్రెస్ పార్టీని ఓడించి దేశంలో తొలిసారి కాంగ్రేసతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించి జాతీయ స్థాయి నాయకులయ్యారు. ఒక సామాన్య క్షురకుని కడుపున జన్మించి, హిందీ ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించి కొన్ని లక్షల మంది యువకులకు ఆదర్శ మయ్యారు. నీతి, నిజాయితీలకు మారు పేరుగా నిలిచారు.

జనతాపార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో కర్పూరీ నాటి బీహార్ జనతాపార్టీ అధ్యక్షులు సత్యేంద్ర నారాయణ్ సిన్హాతో పోటీపడి రెండో పర్యాయం 1977లో బీహార్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే పూర్తికాలం కాకుండా రాజకీయపరమైన కారణాల వల్ల 1979వ సంవత్సరం వరకు మాత్రమే పదవిలో కొనసాగారు. బీహార్ తొలిగా 1978లో వెనుకబడిన తరగతుల వారికి ప్రభుత్వశాఖలలో రిజర్వేషన్ కల్పించడంతోపాటు అనేక సంస్కరణలకు నాంది పలికారు.

మండల అధ్యక్షునిగా పదవి నిర్వహించే నాయకులు విలాసవంతమైన భవనాలలో నివసిస్తూ, విదేశీకార్లలో ప్రయాణం చేస్తున్న రోజులలో కర్పూరీ టాకూర్ ముఖ్యమంత్రిగా వున్నప్పటికీ ప్రభుత్వం ఇచ్చే ఇంటిలో కాకుండా సాధారణమైన తన ఇంటిలోనే జాతి గర్వించే విధంగా సాధారణ జీవితం కొనసాగించారు. దేశంలోని ఇతర ప్రాంతాలలో పర్యటించినప్పుడు కర్పూరీ టాకూర్ ఖరీదైన కారులలో కాకుండా సాధారణ ప్రయాణీకుల మాదిరిగా రైళ్ళలో ప్రయాణం చేయడం, సాధారణ ఇండ్లలో బసచేయడమేకాకుండా తన బట్టలను తానే శుభ్రం చేసుకొనేవారు. కర్పూరీ టాకూర్ ముఖ్యమంత్రిగా వున్నప్పద ఆయన తండ్రి డి గోకుల్ టాకూర్ తన సొంత గ్రామంలో కులవృత్తి చేస్తూ జీవించారు. కర్పూరీ టాకూర్తోపాటు ఆయన తండ్రి గోకుల్ టాకూర్ నిరాడంబరత, సచ్ఛీలత, నిజాయితీలపై జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా అనేక పత్రికలలో ప్రత్యేక కథనాలు వెలువడ్డాయి. సంయుక్త సోషలిస్టు పార్టీకి ఆయన జాతీయ స్థాయిలో అధ్యక్షునిగా పనిచేశారు. ప్రస్తుతం బీహార్లో అత్యంత కీలక నాయకులుగా రాజకీయాలలో ప్రధాన పాత్రవహిస్తున్న లల్లూప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్, రామ్విలాస్ పాశ్వాన్ వంటి నేతలకు ఈయన మార్గదర్శకులు. 1988లో ఆయన మరణానంతరం ఆయన స్వగ్రామం పేరును “కర్పూరీ” గ్రామంగా మార్పు చేశారు. బక్సర్లోని లా కాలేజీకి “ది జన్ నాయక్ కర్పూరీ టాకూర్ విధి మహావిద్యాలయ్” అని పేరు పెట్టారు. భారతీయ తపాలాశాఖ కర్పూరీ జ్ఞాపకార్ధం తపాలా బిళ్లను విడుదల చేసింది.

 

Share This Post

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *