Blog

Latest News

మల్లుగాళ్ల సుబ్బరాయుడు

మల్లుగాళ్ల సుబ్బరాయుడు

పంచాయితీరాజ్ డిపార్ట్మెంట్

ఉద్యోగ విరమణ అనంతరం సంఘ కార్యక్రమాలతోపాటు రాజకీయా లలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న వారిలో మల్లుగాళ్ల సుబ్బారాయుడు ఒకరు. 1955, ఫిబ్రవరి 1వ తేదీన కర్నూలు జిల్లా, నంద్యాల మండలం, ఉదుమల్పూర్ గ్రామంలో లింగన్న-సాలమ్మ దంపతులకు జన్మించారు. గ్రాడ్యుయేషన్ అనంతరం 1981, మార్చి నెలలో పంచాయితీరాజ్శాఖలో క్లర్క్ చేరి అంచెలంచెలుగా గ్రామ పంచాయితీ ఎగ్జిక్యూటీవ్ అధికారిగా, డివిజనల్ పంచాయితీ అధికారిగా ప్రమోషన్లు పొంది 2013, జనవరిలో ఉద్యోగ విరమణ చేశారు.

ఉద్యోగ విరమణ అనంతరం సంఘసేవా కార్యక్రమాలలో క్రియా శీలకంగా పాల్గొనడంతోపాటు నాయీబ్రాహ్మణ సేవా సంఘం(500/82)నకు రాయలసీమ ప్రాంత ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ప్రధానంగా సంఘీయుల సహకారంతో నంద్యాలలో సీతారామ, లక్ష్మణ, హనుమ సమేత శ్రీత్యాగరాజస్వామి ఆలయం, మండపం ఏర్పాటు చేసి, ఆ ఆలయానికి అధ్యక్షునిగా సేవలందిస్తున్నారు. స్థానిక రాజకీయాలలో కూడా క్రియాశీలకంగా వుండటం వల్ల సుబ్బరాయుడు సతీమణి శ్రీమతి విజయలక్ష్మీని ప్రతిష్టాత్మకమైన శ్రీశైలం దేవస్థానం పాలక మండలి సభ్యురాలిగా నియమించారు.

Share This Post

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *