Blog

Latest News
సంఘీయిలు రాజకీయకంగా మరియు సామాజికంగా అభివృద్ది చెందాలనేదే అతని ఆకాంక్ష: వీ ఎస్ ఆర్ వెంకట్

సంఘీయిలు రాజకీయకంగా మరియు సామాజికంగా అభివృద్ది చెందాలనేదే అతని ఆకాంక్ష: వీ ఎస్ ఆర్ వెంకట్

సంఘీయిలు రాజకీయకంగా మరియు సామాజికంగా అభివృద్ది చెందాలనేదే అతని ఆకాంక్ష: వీ ఎస్ ఆర్ వెంకట్

శ్రీ వీ ఎస్ ఆర్ వెంకట్ అనగానే గుర్తుకు వచ్చేది రియల్ ఎస్టేట్ , వీ ఎస్ ఆర్ వెంకట్ పూర్తి పేరు  ఎస్ ఆర్ వెంకటేష్ మనo గర్వించదగిన నాయీ బ్రాహ్మణ ముద్దు బిడ్డ మన వీ ఎస్ ఆర్ వెంకట్ గారు . రెండు తెలుగు రాష్ట్రాలలో సంఘీయులకు బాగా తెలిసిన వ్యక్తి మన వీ ఎస్ ఆర్ వెంకట్ గారు ఒకరు ,అతని కృషి పట్టుదల అతన్ని ముందుకు సాగించాయి . వీ ఎస్ ఆర్ వెంకట్ గారు షాద్ నగర్ నియోజకవర్గం గ్రామం తుమ్మలపల్లి మండల్ జిల్లెడు చౌదరి గూడెం రంగారెడ్డి జిల్లా,తెలంగాణ రాష్ట్రంలో 20/5/1988 లో జన్మించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఓం మణికంఠ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ప్రధాన కార్యదర్శిగా సేవలు అంధిస్తున్నారు . రాజకీయాల్లో కూడా ఎంతో చురుగ్గా పాల్గొని ఎన్నో ప్రశంషలను అందుకున్న వ్యక్తి వీ ఎస్ ఆర్ వెంకట్ గారు. అనేక సంఘ కార్యక్రమాలలో పాల్గొన్నారు తాను స్వయంగా పాల్గొనడమే కాకుండా అనేక ఉద్యోగులైన సంగీయులను సంఘంలో క్రియాశీలకంగా వ్యవహరించేలా ప్రోత్సహించారు, తెలంగాణ రాష్ట్ర కేంద్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రజా యువజన నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు గా సేవలు అంధిస్తున్నారు.

వీ ఎస్ ఆర్ వెంకట్ గారు కులవృత్తి అయిన మంగలి పని చేసుకుంటూనే సంఘం లో ఎన్నో సేవలు అందిస్తున్నారు .
రియల్ ఎస్టేట్లో తాను అనుకున్న స్థాయికి చేరుకున్నారు. నాయి బ్రాహ్మణ సంఘంలో పనిచేస్తూ నాయి బ్రహ్మణులను చైతన్యపరిచాడు ,రియల్ ఎస్టేట్ రంగం లో తనకంటూ ఒక స్తాయిని పెంచుకున్నారు . మన నాయిబ్రాహ్మణ సంఘంలో అతనికి తెలియని నాయకుడు లేడు , నాయీ బ్రాహ్మణ సంఘం లో ఎంతో చురుగ్గా స్పందించే వ్యక్తి ఎవరు అంటే మన వీ ఎస్ ఆర్ వెంకట్ గారు అనవచ్చు. సంఘీయిలు రాజకీయకంగా మరియు సామాజికంగా అభివృద్ది చెందాలనేదే అతని ఆకాంక్ష ,సంఘ సేవ కార్యక్రమాలో చురుగ్గా పాల్గొనడమే అతని ప్రత్యేకత . మన కుల వృత్తి అయిన క్షౌర వృత్తి చేసుకుంటూనే రియల్ ఎస్టేట్ రంగం లో ఆసక్తి చూపించారు అలా తన స్వంత కాళ్ళపై తాను నిలబడి సంఘం లో తనకంటూ ఒక పేరుని సంపాదించుకున్నారు..

Share This Post

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *