Blog

Latest News
సంఘీయులు రాజకీయంగా ,సామాజికంగా చైతన్యం చెందాలి గజ్జెల్లి వెంకన్న గారు .

సంఘీయులు రాజకీయంగా ,సామాజికంగా చైతన్యం చెందాలి గజ్జెల్లి వెంకన్న గారు .

శ్రీ  గజ్జెల్లి వెంకన్న గారి జన్మస్థలం నారాయణపురం( గ్రామం) ,  కురవి  ,(మండలం) ,  మహబూబాబాద్  జిల్లాలో జన్మించారు , ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో నివసిస్తున్నారు .  విద్యాభ్యాసం,1 వ తరగతి నుండి 4 తరగతి వరకు నారాయణపురంలో , 5 వ తరగతి నుండి 7 వ తరగతి వరకు గుండ్రాతిమడుగులో .8 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు కురవి మండలంలో  విధ్యని అభ్యసించారు .

1999 నుండి 2000 సవత్సరంలో  10 వ తరగతి పూర్తి అయిన తర్వాత  చదువు ఆపేసి కుటుంబ బాధ్యతలు భుజంపై  వేసుకొని మన వృత్తి ని   నమ్ముకుని నేటి వరకు జీవనం  కొనసాగిస్తున్నారు. మన  వృత్తి నైపుణ్యంలో ,  రాణించుకుంటూ రాజకీయ నాయకులతో వివిధ అధికారులతో పరిచయాలు ఏర్పరచుకొనినాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు .2005 లో  వివాహం చేసుకొన్నారు. అతనికి  కాంగ్రెస్ పార్టీ అంటే ఎంతో అభిమానం . 2017. ఖమ్మం నగర నాయీ బ్రాహ్మణ సేవా సంఘం ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. 2017 ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీలో బీసీ సెల్ విభాగంలో ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు.  2020 నగర కార్పొరేషన్ లో ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 51 డివిజన్ నుండి  పోటీ చేశారు .  నగర నాయి బ్రాహ్మణ సేవా సంఘం  వర్కింగ్ ప్రెసిడెంట్ గాను  మరియు 2021 లో ఖమ్మం జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టారు . ప్రస్తుతం 2024 తెలంగాణ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సమైక్య సంక్షేమ సేవా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు . 2009,2014,2018,2024, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పని చేశారు. భద్రాచలం నుంచి ఖమ్మం వరకు ఆనాటి సీఎల్పీ నాయకులు  శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారి తో 2021 లో  సైకిల్ యాత్ర, అలాగే 2022  లో మధిర నియోజకవర్గంలో పాదయాత్ర , భారత్ జూడో యాత్ర రాహుల్ గాంధీ గారి యాత్ర, మరియు 2023 లో నాటి పిసిసి అధ్యక్షులు ఎనుముల  రేవంత్ రెడ్డి గారి పాదయాత్రలో పాల్గొన్నారు.

2023 లో భట్టి విక్రమార్క గారి పీపుల్స్  మార్చ్ పాదయాత్రలో కూడా ఎంతో చురుగ్గా పాల్గొని  మన నాయీ బ్రాహ్మణులకు ఒక రాజకీయవేత్తగా ఆదర్శంగా నిలబడుతున్నారు.

నాయిబ్రాహ్మణులకు సామాజిక, రాజకీయ చైతన్యం రావాలనేదే అతని ఆకాంక్ష . ప్రభుత్వం నుండి నాయిబ్రాహ్మణులకు  రావలసిన సంక్షేమ పథకాల కోసం పోరాటాలు ప్రారంభించి సంఘ అభివృద్దికి తోడ్పడుతున్నారు . నాయిబ్రాహ్మణ ఉద్యోగులు, విద్యార్థుల సేవాసంఘాలు ప్రతి ఒక్కరూ ఏకమై తమకు రావలసిన రాజకీయ అవకాశాల కోసం ప్రభుత్వాన్ని నిలదీయాలి అంటూ ఎన్నో సంఘ అభివృద్ది కార్యక్రమాలు కొనసాగించారు. ఆత్మగౌరవంతో బ్రతకడం ముఖ్యం అని ప్రతిఒక్కరికీ సంఘం యొక్క విశిష్టతలను తెలుపుతూ సంఘాన్ని ముందుకు తీసకువెళ్లారు.ఖమ్మం పట్టణంలో గజ్జెల్లి వెంకన్న గారు తెలియని సంఘ సభ్యుడు లేడు. కులమంటే ఎంతో ప్రేమ అభిమానాలను నింపుకున్న మన గజ్జెల్లి వెంకన్న గారు తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సమైక్య సంక్షేమ సేవా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా భాద్యతలను నిర్వహించడం  ఎంతో గర్వించదగిన విషయం ,సంఘీయుడు నుండి సంఘ రాష్ట్ర అధ్యక్షులుగా  సేవలు అంధించడం ఎంతో ప్రశంసనీయమైనది . మన నాయీ బ్రాహ్మణ సంఘంలోనే కాకుండా రాజకీయాల్లో కూడా ఎన్నో కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని మన నాయీ బ్రాహ్మణులకు ఆదర్శంగా నిలబడుతున్నారు.

సంఘీయులతో కలసి మెలసి తిరగడం,సంఘ కార్యక్రమాల్లో  తాను స్వయంగా పాల్గొనడమే కాకుండా అనేక ఉద్యోగులైన సంఘీయులను సంఘంలో క్రియాశీలకంగా వ్యవహారించేలా ప్రోత్సహించారు.

అనాటినుంచే రాజకీయాల్లో ఆసక్తి పెంచుకున్నారు, అనేక సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, వెంకట స్వామి గారు సంఘం కొరకు చేసిన కృషి ద్వారా అనేక సత్కారాలు పురస్కారాలు పొందారు నాయిబ్రాహ్మణుల తరపున అనేక పోరాటాల్లో పాల్గొన్నారు,తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్నారు.

ఎన్నో సంఘ సంస్కరణలు చేస్తూ మన నాయీ బ్రాహ్మణ సంఘాన్ని చైతన్యపరుస్తూ ఎంతో మందికి మంచి మార్గాన్ని చూపిస్తున్నారు . పేదవారికి తనకు తోచినంత సహాయం చేస్తూ పేదవారికి అండగా నిలుస్తున్నారు . ఎలాంటి సమయాల్లోనైనా సంఘ సేవకు ముందుంటారు . పేద  నాయీ బ్రాహ్మణ విద్యార్దులకు సహాయం చేస్తూ వాళ్ళను వాళ్ళ  లక్ష్య సాధనకై ఎల్లప్పుడూ ప్రోత్సాహిస్తున్నారు . సంఘంలో పేద ప్రజలకు ఆర్దిక సహాయం అందేలా తన వంతు కృషి చేస్తున్నారు .

 

మాజీ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వర రావు గారికి గజ్జెల్లి వెంకన్న గారు మరియ నాయీ బ్రాహ్మణ సంఘ నాయకులు అందరూ ఐక్యతగా ఉంటూ నాయీబ్రాహ్మనులకు   అన్నీ రంగాలలో అర్హత కల్పించాలని  ,తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటు, ఖమ్మం పార్లమెంటు  పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకర్గాలలో  ఉన్నటువంటి మార్కెట్ యార్డుల్లో ఒక డైరెక్టర్ పదవిని  మన నాయీ బ్రహ్మణ కులస్తులకు కేటాయించాలంటు ,ఖమ్మం కార్పొరేషన్ పరిదిలో 60 డివిజన్లకు గాను 2 డివిజన్లలో నాయీబ్రాహ్మణ కులస్తులకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలి ,మేజర్ పంచాయితీ పరిదిలో ఒక్కరికీ పోటీ అవకాశం ఇవ్వాలంటు, గ్రామ పంచాయితీ పరిధిలో ఒక్కరికి   పోటీ చేసే అవకాశం ఇవ్వాలంటు. గ్రామ పంచాయితీ మరియు MPTC,ZPTC లుగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని,అర్హత కలిగిన నాయీబ్రాహ్మనులందరికీ గృహాలక్ష్మి పథకం ద్వారా ఆదేవిదంగా ఇంటి స్థలం కేటాయించాలని .నాయీ బ్రాహ్మణులకు అండగా ఉంటూ సంఘ సేవకు ఎంతో కృషి చేస్తున్నారు మన గజ్జెల్లి వెంకన్న గారు.

Share This Post

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *