Blog

Latest News
సాహిత్య నిధి ఎవరు? అంటే చిన్న పిల్లోడి నోట కూడ అలవోకగా వచ్చే పేరు “కరుణానిధి”.

సాహిత్య నిధి ఎవరు? అంటే చిన్న పిల్లోడి నోట కూడ అలవోకగా వచ్చే పేరు “కరుణానిధి”.

తమిళ రాష్ట్రానికి 5సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కరుణానిధి, తమిళ భాషను అందలం ఎక్కించాడు, శ్రీలంక తమిళుల కోసం పాటుబడ్డాడు. “కలైన్నార్”, “ముత్తామిన్ అరిజేనార్” డాక్టర్గా పిలువడ్డ రాజకీయ దురంధరుడు, డీయంకే పార్టీకి ప్రాణం పోసాడు, ఫిల్మ్ ఇండస్ట్రీకి స్క్రీన్ ప్లే, స్క్రిప్ట్ రైటింగ్ వ్రాసాడు, రంగస్థల నాటక రచన చేసాడు, టెలివిజన్ గీతాలు వ్రాసాడు, గ్రంథాలు వ్రాసాడు, సాహిత్య నిధి ఎవరు? అంటే చిన్న పిల్లోడి నోట కూడ అలవోకగా వచ్చే పేరు “కరుణానిధి”.

మద్రాస్ ప్రెసిడెన్సీ నాగపట్నం జిల్లాలో తిరూవలైలో 1924 జూన్ 2వ తారీఖున జన్మించారు. ఆయన అసలు పేరు దక్షిణామూర్తి. ఆయన కవితల చివర కరుణానిధి సుప్రసిద్ధంగా చుట్టేసుకున్న పేరు. దీనికి తగ్గట్టుగా తరువాత, అన్నాదొరై సలహా మేరకు, ఆయనకు కరుణానిధియే సరైనదని నిర్ణయమై స్థిరపడిపోయింది.

12వ యేటనే అంటరాని తనం మీద, కుల సమస్య మీద అనేక ఉద్యమాలు లేవనెత్తాడు. దీనికి తోడు హిందీ భాషా వ్యతిరేక ఉద్యమాలకు కూడా బీజం పోసాడు. జస్టిస్ పార్టీకి సంబంధించిన అలిగిరిస్వామి ప్రసంగ ప్రేరితుడై రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఒక అగ్రకులం వాడు ఎదురైనప్పుడు, తన తండ్రి ఎప్పుడైతే తన భజంపై ఉన్న టవల్ని తీసి చేత్తో పట్టుకున్నాడో, అప్పుడే తన మనసులో రాజకీయపు మెరుపు మెరిసింది. పెరియార్ ఉద్యమంలోకి దూకాడు. తన 15వ యేట “మానవనెసస్” అనే పత్రిక ప్రారంభించాడు. తరువాత తమిళ స్టూడెంట్స్ అసోషియేషన్ అనేది ప్రారంభించాడు.

తన పాతికేళ్ళ పాలనలో అంచెలంచెలుగా చేబట్టిన సంస్కరణాత్మక కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కులతత్వం మన సమాజాన్ని పట్టి పీడిస్తున్న మాయరోగం. దాన్ని అంతమొందించాలని ప్రతీవారికి ఉంటుంది. కానీ కరుణానిధి మూఢ సామాజిక వికృత రూపాన్ని పోగొట్టాలని హెచ్చు తగ్గులను సమంచేయాలని ఒక పాలకునిగా అనేక కార్యక్రమాలకు రూప కల్పన చేశాడు. విద్యార్ధుల సౌలభ్యం కోసం ఉచిత బస్ పాస్ పద్ధతి ప్రవేశపెట్టాడు. రైతు సంక్షేమం కోసం “ఉజ్ఞాపర్ సంధాయి” కుల ప్రాధాన్యత తగ్గించే నిమిత్తంగా “సమతువాపురం ప్రణాళిక’ను అలాగే “ఐటి” అభివృద్ధిలో భాగంగా మినీ బస్సెస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. మద్రాస్ అనే పేరుకు బదులుగా తమిళుల చిహ్నంగా “చెన్నై” అనే పేరును మార్చాడు. ప్రతి కుటుంబంలోని సంతానానికి ఒకరికి (ఒక బిడ్డకు) డిగ్రీ వరకు ఉచిత విద్య సౌకర్యం ప్రవేశపెట్టారు. రిక్షా కార్మికుల కోసం, మహిళాభివృద్ధి కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాడు. ఇవన్నీ కరుణానిధి సంస్కరణాత్మక చర్యలుగా మిగిలిపోతాయి. టైడెల్ పార్క్, జెమిని ఫ్లైఓవర్, కోయంబేడు ఫ్లైఓవర్, పూంపుహార్, అన్నా యూనివర్సిటీ లైబ్రరీ, నూతన సచివాలయం ఇత్యాదులన్నీ పాలనా పరమైన అభివృద్ధి కార్యక్రమాలే కాక తమిళ భాషకు, దాని గుర్తింపుకు చాలా కృషి చేశాడు. ప్రపంచ తమిళ మహాసభకు ఒక అధికారిక సంప్రదాయ గీతాన్ని అందించారు.

సినిమాకు స్క్రిప్ట్టర్గా తన వృత్తి ప్రారంభించిన కరుణానిధి, మొదటిగా 1947లో ఎంజీఆర్ నటించిన రాజకుమారి అనే చిత్రానికి తన సాహిత్యాన్ని అందించారు. శివాజీ గణేషన్, కన్నాంబ నటించిన “పరాశక్తి” “మనోహర” అనే సినిమాలు అప్పట్లో (1952) చెప్పుకోదగ్గ సినిమాలుగా కనిపిస్తాయి. ఆయన 2011 వరకూ సినీ కళామతల్లికి తన రచనా హారతులు అందించాడు. ఏది వ్రాసినా, అన్యాయాన్ని ఖండించడం, మానవతను చాటిచెప్పడం కనిపిస్తుంది.

Share This Post

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *